గద్వాలలో 12,203 అసెస్‌మెంట్లతో 5శాతం రాయితీకి అర్హులుగా ఉన్నారు. వీరిలో కేవలం 2,660 మంది పన్ను చెల్లించి రాయితీ పొందారు. అయిజలో 8,223 అసెస్‌మెంట్లకు గాను 955 మంది రాయితీపై పన్ను చెల్లించారు. అదే విధంగా అలంపూర్‌లో 3,593 మందికిగాను 618 మంది, వడ్డేపల్లి మున్సిపాలిటీలో 4,132 మందికి గాను కేవలం 845 మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందారు.
విస్తృత ప్రచారం చేశాం..
ఆర్థిక సంవత్సరం (2026–27)కు సంబంధించి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ వర్తిస్తుంది.. ఏడాదికి చెల్లించే పన్నులో రాయితీని మినహాయించి తీసుకున్నాం. ఇందుకోసం నాలుగు మున్సిపాలీటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాం. ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశాం. బిల్ కలెక్టర్లు వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.
– నర్సింగ్‌రావు, అదనపు కలెక్టర్
●


