పట్టుదలతోనే విజయం
గద్వాలటౌన్: కృషితో పాటు పట్టుదల ఉంటే విజయాలు సాధ్యపడుతాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బీబీఆర్ ప్రీమియర్ లీగ్ సీజన్–3 క్రికెట్ టోర్నీ ఆదివారం ఉత్సాహంగా సాగింది. రింగ్‌రోడ్డు సమీపంలోని క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించినపుడే వారు ఆ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరగల్గుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. రానున్న కాలంలో క్రీడారంగం ప్రముఖంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాబర్, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, నరహరి శ్రీనివాసులు, దివాకర్‌రెడ్డి, అన్వర్, మౌలానా పాల్గొన్నారు.


