విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
గద్వాలటౌన్: ప్రతి విద్యార్థి బాల్య దశ నుంచే శాసీ్త్రయ దృక్పథం, పరిశీలన అలవర్చుకొని శాస్త్రరంగంలో రాణించాలని రాష్ట్ర ఎసీఈఆర్‌టీ ప్రతినిధి మధుసూదన్‌రెడ్డి సూచించారు. జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెకుముకి పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక బాలభవన్‌లో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవస్థీకృతమైన ప్రాంతాల్లో జ్ఞానాన్ని ప్రసాదించేది విజ్ఞాన శాస్త్రమని వివరించారు. మన జీవన విధానం, అభివృద్ధి, సైన్స్‌తో ముడిపడి ఉందని చెప్పారు. శాసీ్త్రయంగా ఆలోచించే ప్రతి వ్యక్తి శాస్త్రవేత్తే అని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞాన శాస్త్రంపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులలో శాసీ్త్రయ నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. శాస్త్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. అధ్యయనంతోనే అభివృద్ధి ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
జిల్లాస్థాయి చెకిముకి సైన్స్ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల తెలుగు మీడియం విభాగంలో అలంపూర్ న్యూప్లాట్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లీష్ మీడియం విభాగంలో ధరూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలు, ఇంగ్లీష్ మీడియం విభాగంలో అలంపూర్ మాంటీస్సోరి స్కూల్ విద్యార్థులు, రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో వీరాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వీరికి విద్యాధికారులు మెమోంటోతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టులో ప్రతిభ చాటిన ఈ నాలుగు పాఠశాలల విద్యార్థులు వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ మోహన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్‌పాపన్న, జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుషిరాజు, పరంజ్యోతి, కన్వీనర్ ఎల్లాస్వామి, కోశాధికారి భీసన్న తదితరులు పాల్గొన్నారు.


