ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
గద్వాల క్రైం: గద్వాల – అలంపూర్ సెగ్మెంట్ పరిధిలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈమేరకు ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, అక్రమంగా మద్యం, నగదు, వస్తు, సామగ్రి తరలింపు విషయంలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఫంక్షన్‌హాల్స్, గెస్ట్‌హౌస్‌లు, కమ్యూనిటీ హాల్స్, లాడ్జ్‌ల్లో నిరంతరం సోదాలు చేయాలని, రాజకీయ కార్యక్రమాలపై నిఘా ఉంచాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వాఖ్యలు, గొడవలకు కారణమయ్యే పోస్టు లు చేసిన వారిపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో నమోదైన కేసులు, రౌడీషీటర్లు, అనుమా నిత వ్యక్తులను బైండోవర్ చేయాలన్నారు. నామినేషన్ కేంద్రాల్లో పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది ఎవరైన అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు, ఎస్‌ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు.


