నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి స్వీకరించే నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. గురువారం గద్వాల మండలంలో చేపట్టిన పూడూ రు ఎర్రవల్లి, వేలచేర్వు, కొండపల్లి, రేపల్లె గ్రామాల నామినేషన్ల ప్రక్రియతో పాటు ఆయా పంచాయతీలలో ఉన్న ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించా రు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపర్చాల్సిన వయస్సు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకా రం స్వీకరించాలని ఆదేశించారు. నామినేషన్ల డిపాజిట్‌ను స్వీకరించిన వెంటనే రషీదు అందజేయాలని, నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో ఉండే అన్ని అంశాలను అభ్యర్థులు కరెక్టుగా పూరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన ని యామళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరా వు, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం పాల్గొన్నారు.
స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రత
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నా రు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదాంలలో ఈవీ ఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్‌రూంలను కలెక్టర్ ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా కలెక్టర్ ఈ తనిఖీ నిర్వహించారు. స్ట్రాంగ్‌రూంతో పాటు భద్రతా నిర్వహణ, రికార్డులు, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, సూపరింటెండెంట్ కరుణాకర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
నామినేషన్ సెంటర్ తనిఖీ..
ధరూరు: ధరూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ స్వీకరణ సెంటర్ కలెక్టర్ బీఎం సంతోష్ సందర్శించారు. కార్యాలయంలో ఎన్నికల అధికారులతో, హెల్ప్ డెస్క్ సిబ్బందితో మాట్లాడా రు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే వారికి పూర్తి వివరాలు తెలియజేసి నామినేషన్లు స్వీకరించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, మండలంలోని పారుచర్లలోని నామినేషన్ సెంటర్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


