అప్రమత్తంగా ఉండాలి
న్యూమోనియా భారిన పడకుండా ముందస్తుగా పుట్టిన ప్రతిబిడ్డకు వ్యాక్సిన్ వేయించాలి. వయస్సును బట్టి వ్యాధి నియంత్రణకు పిల్లలు, పెద్దవారికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవడం చాలా మంచిది. వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందుతుంది. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి తక్షణ వైద్యసేవలు అందిస్తున్నాం.
– ఇందిరా,
జిల్లా ఆస్పత్రి సూపరింటెండ్
●


