మెరుగైన విద్య అందించాలి
ఇటిక్యాల: విద్యార్ధులకు మెరుగైన విద్య అందించాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చాగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈమేరకు విద్యార్థులకు దేశ సమైక్యత, అభివృద్ధిలో రాజ్యాంగం పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రతి విద్యార్ధి శాసీ్త్రయ దృక్పఽథాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్ధులకు కాన్ అకాడమీ ద్వారా వీడియోలు చూపించాలని, పదో తరగతి విద్యార్థులకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి హంపయ్య, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, అమీర్‌పాష, ప్రధానోపాద్యాయులు కాంతయ్య, విజయ భాస్కర్ పాల్గొన్నారు.


