సొంత బ్రాండ్‌తో విక్రయం..
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగకి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య, రమణరెడ్డి సేంద్రియ సాగు ద్వారా ప్రత్యేకత చూపుతున్నారు. సాధారణంగా మిర్చిపంటకు వారంలో రెండు, మూడుసార్లు పిచికారీ చేయాల్సి వస్తోంది. కానీ, ఈ దంపతులు ప్రకృతి సేద్యం ద్వారా ఎలాంటి రసాయనాలు లేకుండా మిర్చి పండిస్తుండటంతో వీరి ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడింది. మిర్చిలో తెగుళ్లు, పురుగుల నివారణకు వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువులతో ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. వరిలోనూ సాధారణ రకాలు కాకుండా బాస్మతి, బ్లాక్ రైస్ వంటి రకాలు సాగుచేస్తూ నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. ‘లావణ్య బ్రాండ్’, ‘ప్రకృతి సేద్యం’ పేర్లతో తమ ఉత్పత్తులను హైదరాబాద్, ఇతర జిల్లాలకు ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఆర్గానిక్ షాపు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.


