కనులపండువగా ఆదిశిలా వాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి కల్యాణం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, దీరేంద్రదాసు, రవిచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, మహాహోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహుకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
జడ్జి ప్రత్యేక పూజలు
ఆలయంలో గద్వాల జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమా పూజిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ నిర్వహుకులు, అర్చకులు జడ్జీ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి జడ్జి దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను అందజేశారు.
అంతర్జాతీయ పోటీల్లో యువకుడి సత్తా
శాంతినగర్: అంతర్జాతీయ పరుగు పోటీల్లో అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రథమ స్థానంలో నిలిచాడు. 42 కిలోమీటర్ల పరుగుపందెం పోటీలు నేపాల్ రాష్ట్రంలో జరిగాయి. అంతర్జాతీయ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న హరికృష్ణ 42 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి మొదటిస్థానం కై వసం చేసుకున్నాడు. నడిగడ్డ వాసి, మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఇంటర్‌నేషనల్ స్థాయిలో ప్రథమస్థానంలో నిలవడంతో మండల ప్రజలతోపాటు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ హరికృష్ణకు అభినందనలు తెలిపారు.
మద్యం దుకాణాల్లో
‘టాస్క్‌ఫోర్స్’ తనిఖీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలను బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్సు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 2023– 2025 వరకు మద్యం దుకాణాలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఎంత మద్యం విక్రయించారు, ఆర్థిక లావాదేవీలు, స్టాక్ ఎంత ఉంది తదితర విషయాలపై రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువగా ధరలకు విక్రయాలు చేపడితే శాఖ పరమైన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. త్వరలో నూతన మద్యం పాలసీ ప్రారంభం కానుండడంతో వ్యాపారులు ఎవరు కూడా పాత స్టాకుకు సంబంధించిన వివరాల నివేదికాలు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా విధుల్లో భాగంగా రాష్ట్ర ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్సు సిబ్బంది మద్యం, కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారని తెలిపారు.
ఉమ్మడి జిల్లా
హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
కోస్గి రూరల్: ఉమ్మడి జిల్లా అండర్ – 17 హ్యాండ్‌బాల్ బాల,బాలికల జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీయావుధ్దిన్, ఎజ్జీఎప్ సెక్రెటరీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈమేరకు ఎంపికలు చేపట్టారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిది నుంచి 180 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచిన 16 మంది బాలురు, 16 బాలికలను ఉమ్మడి జిల్లా జట్టుగా ఎంపిక చేశామని తెలిపారు. అంతకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్‌లు సాయినాథ్ , రామకృష్ణారెడ్డి , రవికుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
కనులపండువగా ఆదిశిలా వాసుడి కల్యాణం


