ఘనంగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం
సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులు
ఎర్రవల్లి: కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు బీచుపల్లికి కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం ఉపవాసంతో 80 జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు దత్తుస్వామి, భువనచంద్రాచార్యులు వేదమంత్రాల నడుమ సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు గద్వాలకు చెందిన రిటైర్డ్ టీచర్ రామ తులశమ్మ కుటుంబ సభ్యులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు ఉన్నారు.
ఘనంగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం


