చేపలు పెరగడం లేదు..
చేపల వృత్తినే నమ్ముకుని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకం. కానీ, జూన్‌లో వదలాల్సిన చేపపిల్లలను అక్టోబర్, నవంబర్‌లో వేస్తున్నారు. దీంతో సీజన్ ప్రకారం తదుపరి వచ్చే మే నెల వరకు చేపలు అంతగా పెరగడం లేదు. ప్రతిసారి ఇలాగే చేస్తుండటంతో మాకు మేలు జరగకపోవడంతోపాటు సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. వర్షాకాలం ప్రారంభంలోనే చేపపిల్లలు చెరువుల్లో వదలితేనే ప్రయోజనం ఉంటుంది.
– ఇప్పలి జనార్దన్,
మత్స్యకారుడు, కొనగట్టుపల్లి,
హన్వాడ మండలం, మహబూబ్‌నగర్
ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి చేప విత్తనాలు అప్పుడే వేయాలి. ఆ సమయంలో వేస్తే ఇప్పటి వరకు చేప బరువు 250 గ్రాముల వరకు పెరిగేది. ఆలస్యంగా వేయడం వల్ల కొన్ని చెరువులలో నీరు తగ్గి.. చేప బరువు పెరగదు. దీని వల్ల మత్స్యకారులకు ఎలాంటి లాభం ఉండదు. ఈసారి ఇప్పటి వరకు చేప విత్తనాలు పంపిణీ చేయలేదు.
– అల్లోజి, మత్స్య సహకార సంఘం
జిల్లా ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
●
చేపలు పెరగడం లేదు..


