
రోడ్ల అభివృద్ధికి రూ.316 కోట్లు మంజూరు
గద్వాల: గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిషలు కృషి చేస్తానని ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌ఆర్ శాఖలకు చెందిన రహదారుల మరమ్మతుకు రూ.316కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎరగిర–అయిజ–అలంపూర్ రహదారికి రూ.9.61కోట్లు, గద్వాల – రంగాపూర్‌రోడ్డుకి రూ.39.84కోట్లు, గద్వాల–రాయచూరు రహదారికి రూ.74.29కోట్లు, గద్వాల–అయిజరోడ్డుకు రూ.24.32కోట్లు, బలిగెర మాచెర్ల రోడ్డుకు రూ.12.80కోట్లు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా గద్వాల నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్లకు రూ.154 కోట్లు నిధులు మంజూరీ అయినట్లు వివరించారు. దీంతోపాటు నర్సింగ్‌కాలేజీ నిర్మాణం పూర్తి అయ్యిందని, నవంబర్ 25వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే, రూ.80 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఆయలకమిటీ చైర్మన్ వెంకట్రాములు, ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, బాబర్, మురళి, విక్రమ్‌సింహారెడ్డి, నాగులు, చంద్రశేఖర్, రిజ్వాన్, కురుమన్న, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.