
వేరుశనగ క్వింటా రూ.5,320
పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 450 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5320, కనిష్టం రూ. 2820, సరాసరి రూ. 4399 ధరలు లభించాయి. అలాగే, 141 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5960 కనిష్టం రూ. 4920, సరాసరి రూ. 5940 ధరలు పలికాయి.
నిఘా అవసరం
చెక్‌పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది.

వేరుశనగ క్వింటా రూ.5,320

వేరుశనగ క్వింటా రూ.5,320