
అమరుల త్యాగం అజరామరం
గద్వాల క్రైం: పోలీసు అమరవీరుల త్యాగం అజరామరమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎస్పీ పాల్గొని మా ట్లాడారు. పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా బీచుపల్లి పదో బెటాలియన్, పోలీసు శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న పోలీసుల సేవలు త్యాగనిరతికి తార్కాణమని, విధుల్లో అమరులైన పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ నవ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు చేయూత ఇవ్వాలన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా పోలీసు ఉన్నాడనే ధైర్యంతో ప్రజ లు నమ్మకంగా ఉన్నారని, విపత్కర సమ యాల్లో బాధితులకు మనోధైర్యం ఇచ్చేది పోలీసులే అని అన్నారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతామనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ జయరాజు, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవి, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు