
రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ
అయిజ: నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం ద్వారా రైతులకు వందశాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందకపోవడంపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఊరించి.. ఉసూరుమనిపించారు’ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. రైతులకు సత్వరమే వందశాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక వ్యవసాయశాఖ అధికారులు అయిజలోని రైతు సంఘం గోదాం వద్ద రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు 400 మంది రైతులకు 60 కిలోల చొప్పున విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఓ జనార్దన్, రైతు ఉత్పత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ