మహమ్మదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
●
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం.
– జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్
అండగా సఖి కేంద్రం..
వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్‌ఫ్రీ నం.181కు ఫోన్ చేసి సమస్యను చెప్పవచ్చు.
– సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్,
మహబూబ్‌నగర్
2022 నుంచి ఉమ్మడి జిల్లాలో నమోదైన పోక్సో కేసులు
జిల్లా నమోదైన కేసులు
2022 2023 2024 2025
(జూన్)
మహబూబ్‌నగర్ 133 116 133 69
వనపర్తి 47 46 54 42
జోగుళాంబ గద్వాల 74 73 51 36
నాగర్‌కర్నూల్ 86 91 105 45
నారాయణపేట 50 42 80 39