
అధికారి కనుసన్నల్లోనే దందా..
సివిల్‌సప్‌లై శాఖలో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఓ అధికారి కనుసన్నల్లోనే ధాన్యం దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రబీసీజన్‌లో రికార్డుస్థాయిలో జిల్లాలో ధాన్యం కొనుగోలు జరిపారు. అయితే మిల్లర్ల సామర్థ్యం పెంచి ఏకంగా ఈ ఒక్క సీజన్‌లోనే సుమారు రూ.50 లక్షల వరకు మిల్లర్ల నుంచి వసూలు చేసి వెనకేసుకున్నాడన్న ఆరోపణలు సదరు అధికారిపై వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సీఎమ్మార్ బియ్యానికి బదులుగా పీడీఎస్ బియ్యం అందిస్తే వాటిని పాస్ చేయటానికి లారీకి రూ.50వేల నుంచి రూ.60వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఈక్రమంలో గత ఏడాది అక్టోబర్‌లో జింకలపల్లి రైస్‌మిల్లు నుంచి వెళ్లిన పీడీఎస్ బియ్యం ఎలాంటి పరీక్షలు చేయకుండానే గోదాంకు పంపకుండా నేరుగా అయిజ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు పంపడం హాట్‌టాపిక్‌గా మారింది. జింకలపల్లి రైస్‌మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టుబడగా పోలీసు కేసు నమోదు చేస్తే సదరు మిల్లు ఓనర్ జైలుకు సైతం వెళ్లొచ్చారు.