
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రజలకు మరో 30, 40ఏళ్ల పాటు తాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం రూ.2కోట్లతో 10లక్షల లీటర్ల వాటర్‌ట్యాంకు నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లి సమీపంలో నూతన వాటర్‌ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా నూతన వాటర్‌ట్యాంకును మంజూరు చేసిందని, వేసవిలో గద్వాల పట్టణవాసులకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు బండారి భాస్కర్, రామన్‌గౌడ, వెంకట్రాములు, శ్రీకాంత్‌రెడ్డి, దౌలు, శ్రీమాన్నారయణ, కృష్ణ, నాగులు, సోమన్న, ధర్మనాయుడు, అన్వర్, మధు, ప్రవీణ్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.