
బ్యాటింగ్‌లో ‘ప్రతీక’ ప్రతిభ
మహహ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన ప్రతీక తాండూరులో తొమ్మిదో తరగతి చదువుతోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్స్ క్రికెట్ లీగ్‌లో పాల్గొని ప్రతిభచాటింది. వికెట్ కీపర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తోంది. హైదరాబాద్‌లోని కేఎస్‌ఎం క్లబ్‌లో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ప్రతీక గత ఏడాది అండర్–15 టోర్నీలో హెచ్‌సీఏ జట్టు తరఫున తమిళనాడు, ఆంధ్ర జట్లతో మ్యాచ్‌లు ఆడింది. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో వుమెన్ క్రికెట్ లీగ్ నిర్వహించడం సంతోషంగా ఉందని, క్రికెట్‌లో ప్రతిభ కనబరిచి భారత జట్టు ఆడాలన్నదే తన లక్ష్యమంటోంది ప్రతీక.