
అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
మానవపాడు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని.. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని ఆర్డీఓ అలివేలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వడ్డేపల్లి, రాజోలి మండలాల బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఎవరి పేర్లు అయిన లేనట్‌లైతే వారి వద్ద నుంచి ఫాం–6 తీసుకొని నమోదు చేయాలని తెలిపారు. ఓటర్ జాబితాలో ఎవరి పేరు అయినా లేకపోతే తప్పనిసరిగా పొందుపర్చాలని, ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బీఎల్‌ఓలు విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జోషి శ్రీనివాస్‌శర్మ, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.