
బీచుపల్లిలో ప్రముఖుల ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని సోమవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ డైరెక్టర్ చక్రపాణి సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్‌గౌడ్ శేష వస్త్రాలతో సత్కరించగా.. అర్చకులు తీర్ధప్రసాదాలను అందించి ఆలయ విశిష్టతను గురించి వివరించారు. ఆయన వెంట ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ తిరుపతిరావు, ఎడి నవీన్‌బాబు, ఎఈ శేఖర్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఉదయాన్నే భక్తులు బీచుపల్లికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.