
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పలు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదులు అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 ఫిర్యాదులు రాగా.. వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 19 అర్జీలు
గద్వాల క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 19 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి ఎస్పీ శ్రీనివాస్‌రావు నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 19 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.