
సందడిగా పీర్ల ఊరేగింపు
ఎర్రవల్లి: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు ఉమ్మడి ఇటిక్యాల మండలంలో ప్రజలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆర్ గార్లపాడు, పుటాన్‌దొడ్డి, సాసనూలు, సాతర్ల, మునుగాల, చాగాపురం, తదితర గ్రామాల్లో వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రధానంగా ఆర్. గార్లపాడులో సాయంత్రం నుంచి మద్దెలబండ ఉశేన్‌షాబ్‌ను దర్శిచుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పెద్దపీరు.. మద్దెలబండ ఉశేన్‌షాబ్‌కు కొబ్బరికాయలు కొట్టి, ముడుపులను, దట్టీలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అలాయి గుంతల చుట్టూ డప్పులతో అలాయి ఆడుతూ పెద్దలు, యువకులు చిందులేశారు. అనంతరం పీర్లు సవారీకి లేచి గ్రామాల్లో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. రాత్రి డప్పు చప్పుల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి పీర్లను నిమజ్జనం చేశారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
డప్పు చప్పుళ్లకు ఆడిపాడిన యువత

సందడిగా పీర్ల ఊరేగింపు