
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
వెల్దండ: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొట్ర గ్రామానికి చెందిన చిట్టయ్య(65) మేకల కాపరిగా ఉండేవాడు. ఈనెల 5వ తేదీ సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. మద్యానికి బానిసై అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లి 10 రోజులకోసారి వచ్చేవాడు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం దుర్వాసన రావడంతో సమీప పొలాల రైతులు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి సమీపంలోని ప్రభుత్వ భూమిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న పోలెమోని చిట్టయ్య(65)ను గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ కురుమూర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుల్లిపోవడంతో సంఘటనా స్థలంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్ప త్రి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిట్టయ్యకు భార్య బాలమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భార్యనిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతూ
భర్త మృతి
జడ్చర్ల టౌన్: నాలుగు రోజుల క్రితం వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కావేరమ్మపేటకు చెందిన చింతకుంట రాములు(52), తిరుపతమ్మ భార్యభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుండేవి. దీంతో నాలుగు రోజుల క్రితం భార్య రాములుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే కాలిన గాయాలతో ఉన్న అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు.
కాగా జిల్లా ఆస్పత్రిలోనే రెండురోజుల క్రితం మరణవాంగ్మూలం నమోదు చేశారు. ఘటనపై రాములు సోదరుడు యాదయ్య జడ్చర్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివాహం జరిగిన నాటి నుంచి అన్నతో వదిన గొడవలు పడేదని, అదే క్రమంలో పెట్రోలు పోసి నిప్పంటించిందని ఫిర్యాదులో పొందుపర్చాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, అంత్యక్రియల నిమిత్తం సాయంత్రం వరకు అనుమతిచ్చారు.
ఇద్దరు పిల్లలతో
సహాతల్లి అదృశ్యం
నవాబుపేట: ఇంట్లో అందరు నిద్రిస్తూ ఉండగా తల్లి ఇద్దరు పిల్లలతో అ దృశ్యమైన సంఘటన మండలంలోని తీగలపల్లి శుక్రవారం చోటుచేసుకుంది. జడ్చర్ల మండ లం నాగసాలకు చెందిన ఎడ్ల కృష్ణయ్య కుటుంబంతో ఐదేళ్ల క్రితం మండలంలోని తీగలపల్లికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణయ్యకు భార్యతో పాటు ముగ్గు రు పిల్లలు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన అందరు తిని నిద్రించిన తరుణంలో తెల్లవారుజామున భార్య శ్రీదేవి (35) ఆ యన ఇద్దరు కుమారు లు విశ్వప్రసాద్(7), అ ఖిల్(5)లు కనిపించకుండ పోయారు. దీంతో ఆయన చుట్టుపక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్ర మ్ తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య