
జోగుళాంబ సన్నిధిలో ఎన్‌ఐసీడీసీ సీఈఓ
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) సీఈఓ, ఎండీ రజత్ కుమార్ శైనీ సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయ సిబ్బంది శేషవస్త్రాలతో సత్కరించారు. సీఈఓ వెంట తహసీల్దార్ మంజుల ఉన్నారు.
పిల్లల పెంపకంలో
లింగభేదం చూపొద్దు
అలంపూర్: పిల్లల పెంపకంలో లింగభేదం చూపొద్దని.. ఆడ–మగ పిల్లలను సమానంగా పెంచాలని యూనిసేఫ్ ప్రతినిధి మేరీ జోన్స్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి మండల కేంద్రంలో కిషోర బాలికలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆడ–మగ పిల్లలు ఇద్దరు సమానమేనని అన్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరినీ సమాన భావంతో విద్యావంతులను చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ నెల 2 నుంచి జూన్ 2వ తేదీ వరకు వేసవిలో కిషోర బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అలంపూర్ మండలం క్యాతూర్‌లో కిషోర బాలికలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి ఎల్లప్ప, ఏపీఎం ప్రవీణ్, సీసీలు విజయలక్ష్మి, రజిత, వీఓఏలు అంజలి, మౌనిక లావణ్య, రియాజ్ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.4,790
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 72 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 4,790, కనిష్టంగా రూ. 3,421, సరాసరి రూ. 4,430 ధరలు వచ్చాయి. 22 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,839, కనిష్టంగా రూ. 5,819, సరాసరి రూ. 5,839 ధరలు లభించాయి. 294 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 1,972, కనిష్టంగా రూ. 1,521, సరాసరి రూ.1959 ధర పలికింది. ఏడు క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,429, కనిష్టంగా రూ. 6,119, సరాసరి రూ. 6,229 ధరలు వచ్చాయి.
రేపు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన (గురువారం) పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8 ప్రైవేట్ కంపెనీల్లో 450 ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఇద్దరు ఎస్‌ఐల బదిలీ
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలకు స్థానచలనం కల్పిస్తూ జోగులాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కోయిలకొండ ఎస్‌ఐగా పని చేస్తున్న భాస్కర్‌రెడ్డిని వీఆర్ వనపర్తికి బదిలీ చేయగా, వీఆర్ వనపర్తిలో ఉన్న కె.తిరుపాజీని కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌ఐగా బదిలీ చేశారు.

జోగుళాంబ సన్నిధిలో ఎన్‌ఐసీడీసీ సీఈఓ