
‘హద్దు’ మీరిన దందా!
●
చర్యలు తీసుకుంటాం..
పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకున్న వ్యవహారంపై విచారణ జరిపాం. వేరే వడ్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి కొనుగోలు నిలిపివేశాం. సివిల్‌సప్‌లై శాఖలో, రైస్‌మిల్లర్లపై వస్తున్న ఆరోపణలపై నిఘా ఉంచాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్
గద్వాల: ‘‘కాయ్ రాజా కాయ్.. మంచి తరుణం మించిన దొరకదు.. మీ రాష్ట్రంలో వరిధాన్యం క్వింటాల్‌కు రూ. 1,900 ఉంటే.. ఇక్కడ రూ. 2,300కు కొంటాం.. పైగా రూ. 500 బోనస్ వస్తుంది.. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే.. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. నాకు ఇవ్వాల్సిన వాటా అడ్వాన్స్‌గా టేబుల్ మీద పెడితే మీ పని చిటికెలో అయిపోతుంది.’’ .. జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఓ సివిల్ సప్లయ్ శాఖ అధికారి బాహాటంగానే లంచావతారమెత్తి ఓపెన్ యాక్షన్ బోర్డు పెట్టేయడం
సంచలనంగా మారింది.
జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో సదరు అధికారి వ్యవహార శైలి నా రూటే సప‘రేటు’ అన్న సినిమా డైలాగ్ తరహాలో ఉంటుందనే పేరుంది. ఆయన మెచ్చిన బడా రైస్‌మిల్లర్లతోనే మంతనాలు జరుపుతూ.. వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణలో సైతం అక్రమార్కులతో ముందస్తు ఒప్పందం చేసుకుని పొరుగు రాష్ట్రాల ధాన్యాన్ని గోల్‌మాల్ చేస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. సదరు అధికారి వ్యవహారశైలి ఉన్నతాధికారులకు సైతం తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ రైస్‌మిల్లుకు అధికంగా ధాన్యం కేటాయించటానికి ఏకంగా రూ.లక్షక్షల్లో వసూళ్లు చేశారనే విషయం షికారు చేస్తోంది. అయితే సదరు మిల్లర్‌కు మిగతా మిల్లుల కంటే అధికంగా ధాన్యం కేటాయింపులు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది.
పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం
ఆయన రూటే సప‘రేటు’..
బినామీ పేర్లమీద జోరుగా అమ్మకాలు
ధాన్యం గోల్‌మాల్‌లో చక్రం తిప్పుతున్న సివిల్‌సప్లయ్ అధికారి
ఇప్పటికే రూ.లక్షల్లో వసూళ్లు?
అంతర్గత విచారణకు ఆదేశించిన అదనపు కలెక్టర్

‘హద్దు’ మీరిన దందా!