
ఇంట్రా లీగ్‌లో రాణిస్తే హెచ్‌సీఏ టోర్నీలో అవకాశం
గద్వాలటౌన్: ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లో రాణించే క్రీడాకారులను హెచ్‌సీఏ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని గద్వాల క్రికెట్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పట్వారీ వెంకటేశ్ అన్నారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ మంగళవారం ప్రారంభమైంది. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటిసారిగా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్‌లు ప్రారంభించిందన్నారు. జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని సూచించారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో ఆతిఽథ్య గద్వాల జట్టు నారాయణపేట జట్టుపై 94 పరుగుల ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గద్వాల జట్టు 40 ఓవర్లలో 240 పరుగులు చేసింది. జట్టు క్రీడాకారుడు జయసింహ 48, అరుణ్‌కుమార్ 47 పరుగులతో రాణించారు. నారాయణపేట జట్టు బౌలర్ ఆశిష్ 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపేట జట్టు 146 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు క్రీడాకారుడు ప్రతీష్ 50 పరుగులతో రాణించారు. గద్వాల జట్టు క్రీడాకారుడు అరుణ్‌కుమార్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్ల తీశారు. ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌చంద్ర, కార్యదర్శి శ్రీనివాస్, కోచ్‌లు రుషేంద్ర, హరినాథ్ పాల్గొన్నారు.