
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
మానవపాడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పీడీ కాశీనాథ్ సూచించారు. శనివారం మండలంలోని నమూనా ఇంటి నిర్మాణాన్ని, ఇందిరమ్మ ఫైలెట్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో కొంతమందికి ఇళ్లు మంజూరు చేశామని, మిగిలిన ఇళ్ల నిర్మాణాలను ఎంపిక చేసేందుకు అలాట్‌మెంట్ జాబితా తయారు చేశామన్నారు. లబ్ధిదారుల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత పేదవారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. చంద్రశేఖర్‌నగర్‌లో లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాలను త్వరగా చేపట్టేలా.. నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ నరేంద తదితరులు పాల్గొన్నారు.