గద్వాలటౌన్: ఇంటర్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మార్చి 5 నుంచి ప్రారంభమైన పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ–2, కామర్స్–2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3,577మంది విద్యార్థులకుగాను 3,458 మంది హాజరయ్యారు. పలువురు రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేటు విద్యార్థులు మొత్తం కలిపి 117 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను ఇంటర్ విద్య జిల్లా అధికారి హృదయరాజు, మండల కేంద్రాలలోని కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు తనిఖీ చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పరీక్షలు ముగిసిన వెంటనే స్నేహితులు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. సంతోషంగా ఇంటిబాట పట్టారు.
117 మంది విద్యార్థులు గైర్హాజరు