గతేడాది వేసవిలో పొలంలో గడ్డివాము నిల్వ చేశాం. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనో ఏమో మధ్యాహ్నం ఇంటికి వెళ్లి వచ్చేసరికి గడ్డివాములు మొత్తం దగ్ధమయ్యాయి. కొన్ని రోజులపాటు పశువులకు మేత కరువైంది. ఒక్కో గడ్డివాము రూ.14వేలు పెట్టి కొనుగోలు చేశాం.
– గోద జయన్న, ఉండవెల్లి
అవగాహన కల్పిస్తున్నాం
ఇళ్లు, విద్యాసంస్థలు, గోదాములు, పెట్రోల్ బంకులు, పరిశ్రమల్లో వేసవిలో అగ్ని ప్రమాదాలు నియంత్రించే సాధనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య వంతులను చేయడానికి అవగాహన కార్యక్రమాలు, మాక్‌డ్రిల్స్ చేపడుతున్నాం. గతంతో పోల్చితే ప్రమాదాలు బాగా తగ్గాయి. – కురుమూర్తి,
ఇన్‌చార్జ్ ఫైర్ ఆఫీసర్, అలంపూర్ చౌరస్తా
●