అలంపూర్: ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రాజగంగారెడ్డి అన్నారు. బుధవారం అలంపూర్‌లో ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. 2005 నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు, డీఏలు పెండింగ్‌లోఉన్నాయని, త్వరగా ఇవ్వాలన్నారు. పీఆర్‌సీను అమలు చేయాలని, ప్రధానోపాధ్యాయుల సమస్యలపై చర్చించిన ఆయన త్వరలో వాటి పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, ప్రధానోపాధ్యాయులు హేమలత, శ్రీనివాసులు, వెంకటేశ్వర రెడ్డి, అమరేందర్ రెడ్డి, జాఫరుల్లా, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.