పంటలు ఎండుతున్నాయ్‌ | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండుతున్నాయ్‌

Mar 11 2025 1:17 AM | Updated on Mar 11 2025 1:18 AM

జోగుళాంబ గద్వాల
నెట్టెంపాడు ఆయకట్టుకు అందని సాగునీరు

మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025

వివరాలు 8లో u

దాదాపు 3వేల ఎకరాల్లో

వరి పంట వాడుముఖం

నీరందించి పంటలు

కాపాడాలంటూ రైతుల ఆందోళన

కలెక్టరేట్‌ వద్ద ధర్నా..

వినతిపత్రం అందజేత

6 ఎకరాల్లో ఎండిన పంట

నెట్టెంపాడు ప్రాజెక్టు 104 ప్యాకేజీ డి–9 కింద 15ఎకరాలలో వరిపంట వేశాను. పంట కంకి దశలో సాగునీరు లేకపోవడంతో 6 ఎకరాలు ఎండిపోయింది. పైభాగాన ఉన్న కొందరు రైతులు అనధికారికంగా కాల్వకు మోటార్లు వేసి నీటిని తోడేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మిగిలిన 9 ఎకరాల వరి పంటనైనా కాపాడాలి. వెంటనే నీరు అందించాలి. – పద్మారెడ్డి, రైతు

కొండాపురం కెటి.దొడ్డి మండలం

బోరువేసినా నీళ్లు పడలే

104 ప్యాకేజీ పరిధిలో డి–9లో మాకు ఉన్న 8ఎకరాల్లో వరిపంట వేశాను. సాగునీరు అందక 4 ఎకరాలు ఎండిపోయింది. పంటను కా పాడుకునేందుకు రూ.50వేలు ఖర్చు పెట్టి బోరు కూడా వేశాను. నీళ్లు పడలేదు.అధికారు లు స్పందించి మిగిలిన పంటనైనా కాపాడాలి.

– సత్యపాల్‌రెడ్డి, రైతు

పంటలు కాపాడాలి

నాకు 5 ఎకరాల భూమి ఉంది. మొత్తం వరి పంట వేయగా.. నీరు అంద క 3 ఎకరాలు ఎండిపోయింది. ప్రాజెక్టు పైను న్న రైతులు అనధికారికంగా మోటార్లు పెట్టుకుని నీళ్లు తోడుకుంటున్నా రు. అధికారులు స్పందించి పంట కాపాడాలి.

– డొల్లు గోవిందు, రైతు, కొండాపురం

అధికారులు స్పందించాలి

5 ఎకరాల్లో వరిపంట వేశాను. నీరు అందకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. ఖరీఫ్‌లో ప్రభుత్వం ఇచ్చిన బోనస్‌ డబ్బులు కూడా కలిపి వరిపంట వేశాను. ఈసారి మొత్తం పంట ఎండిపోయే పరిస్థితి. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలి. – రంగారెడ్డి, రైతు, కొండాపురం

గద్వాల: ‘ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో నీరులేక ఎండిపోతున్నాయి.. ప్రభుత్వం బోనస్‌ ఇస్తుందనే ఆశతో యాసంగిలో కూడ వరిపంటను సాగుచేశాం. పంట గింజపట్టే దశలో నీరు అందడం లేదు. దీంతో 2వేల ఎకరాల వరిపంట ఇప్పటిఏ ఎండిపోయింది. అధికారులు స్పందించి సాగునీరు అందించకపోతే మరో 3 వేల ఎకరాల పంటలు ఎండిపోతాయి.. సాగునీరు అందించి పంటలను కాపాడండి..’ అంటూ నెట్టెంపాడు రైతులు ఆందోళన బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. అనంతరం కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకొని.. గింజ దశలో ఉన్న పంటలను కాపాడాలని వినతిపత్రం అందజేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 104ప్యాకేజీ పరిధిలోని రైతుల సాగునీటి కష్టాలపై కథనం..

నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధి ర్యాలంపాడు జలాశయంలో లీకేజీలు ఏర్పడడంతో గత నాలుగేళ్లుగా పూర్తి స్థాయిలో అంటే 4 టీఎంసీలకు బదులు 2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతూ వస్తున్నారు. ఈనేపథ్యంలో యాసంగిలో 2టీఎంసీల నీటితో సుమారు 20వేల ఎకరాల వరకు ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తారు. అయితే రైతులు మాత్రం ఎన్నో ఆశలతో సుమారు 50వేల ఎకరాల వరకు పంటలు సాగుచేశారు. దీంతో అందుబాటులో ఉన్న నీటితో మొత్తం 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలంటే కష్టతరంగా మారింది. ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు కాల్వలకు మోటార్లు వేసుకుని సాగునీటిని పారించుకుంటున్నారు. దీంతో ఆయకట్టుదారులు సాగుచేసుకున్న పంటలకు సాగునీరు పారటం కష్టంగా మారింది.

ఆందోళన చెందొద్దు

104 ప్యాకేజీ కింద సాగుచేసిన పంటలకు పూర్తిస్థాయిలో నీరుఅందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయనే విషయాన్ని రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్‌, ఇరిగేషన్‌ శాఖ అధికారులతో మాట్లాడాను. రెండు మూడు రోజుల్లో సాగునీరు అందించేలా చర్యలు తీసుకుని పంటలను కాపాడుతాం. రైతులు ఆందోళన చెందొద్దు.

– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల

వారబందీ విధానంలో..

104 ప్యాకేజీ కింద వాస్తవానికి 5వేల ఎకరాలకు మాత్రమే వారబంధీ విధానంలో సాగునీటిని ఇస్తామని రైతులకు ముందస్తుగానే చెప్పాం. కానీ రైతులు 15వేల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. దీంతో పాటు కొందరు రైతులు కాల్వకు మోటార్లు వేసుకుని నీటిని తీసుకుంటున్నారు. ఈ కారణాలతో కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తాయి. విషయాన్ని మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. – రహీముద్దీన్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ

104 ప్యాకేజీ కింద 15వేల ఎకరాలు

నెట్టెంపాడు ప్రాజెక్టు 104 ప్యాకేజీ కింద మొత్తం 15వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఉన్న నీటి నిల్వల దృష్ట్యా సాగుచేసిన 15వేల ఎకరాలకు సాగునీరు పారడం ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉంటే కొందరు రైతులు అనధికారికంగా కాల్వలకు మోటార్లు వేసుకుని సాగునీటిని తోడేస్తున్నారని నెట్టెంపాడు ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో 104 ప్యాకేజీ డి–9 కింద సాగుచేసిన 5వేల ఎకరాల్లో సుమారు 2వేల ఎకరాల వరకు వరిపంటకు సాగునీరు అందక ఎండిపోయింది. మిగిలిన 3వేల ఎకరాలకు సాగునీరు అందించకపోతే ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో రైతులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. అనంతరం తమ పంటలకు సాగునీటిని అందించి పంటలు కాపాడాలని కలెక్టర్‌ను కోరారు.

ఆశలు..

అంచనాలు తలకిందులు

పంటలు ఎండుతున్నాయ్‌ 1
1/5

పంటలు ఎండుతున్నాయ్‌

పంటలు ఎండుతున్నాయ్‌ 2
2/5

పంటలు ఎండుతున్నాయ్‌

పంటలు ఎండుతున్నాయ్‌ 3
3/5

పంటలు ఎండుతున్నాయ్‌

పంటలు ఎండుతున్నాయ్‌ 4
4/5

పంటలు ఎండుతున్నాయ్‌

పంటలు ఎండుతున్నాయ్‌ 5
5/5

పంటలు ఎండుతున్నాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement