
గద్వాల రూరల్: ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా రూపొందించాలని ఎన్నికల పరిశీలకురాలు భారతీ లక్పతీనాయక్ అన్నారు. సోమవారం ఆమె కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి ఐడీవోసీ కార్యాలయంలో ఓటరు జాబితా తయారీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీ వరకు ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా తుదిఓటరు జాబితాను సిద్దం చేయాలన్నారు. డబుల్‌ఎంట్రీలు, డెత్‌ఓటర్లకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం వారిపేర్లను తొలగించాలన్నారు. జిల్లాలో కేటి.దొడ్డి, రాజోలి, ధరూరు, మానవపాడు, వడ్డేపల్లి మండలాల్లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని సత్వరమే పూర్తిచేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
అనంతరం ఆమె కలెక్టర్‌తో కలిసి గద్వాల పట్టణంలోని దౌదర్‌పల్లి, పాత ఎంపీడీవో కార్యాలయం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగంలోని కంప్యూటర్లు, పెండింగ్ దరఖాస్తులు పరిశీలించారు. కేంద్ర ఎన్నికల బృందం ఎప్పుడైనా రావచ్చని ఆలోగా అన్ని రకాలుగా సిద్ధం చేయాలన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ్‌చౌహాన్, చీర్లశ్రీనివాసులు, ఆర్డీవో చంద్రకళ, నరేష్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
మార్గదర్శకాలు పాటించాలి
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరించి తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం ఆమె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పోలింగ్, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చీర్లశ్రీనివాసులు, ఎన్నికల విభాగం పర్యావేక్షులు నరేష్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
ఎన్నికల పరిశీలకురాలు భారతీ లక్పతినాయక్