
అయిజలో పోలీస్ బలగాలు
చిన్నోనిపల్లె రిజర్వాయర్ పనులను వందశాతం పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో జిల్లా అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ పనులను పూర్తి చేసే క్రమంలో ఐదు గ్రామాల భూ నిర్వాసిత రైతుల నుంచి ప్రతిఘటన ఎదురు కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరింపజేశారు. శనివారం మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచి నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, ఆరుగురు మహిళా ఎస్‌ఐలు, 162 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్, పోలీస్, హోంగార్డులు, 54 మంది మహిళా హోంగార్డులతోపాటు మూడు స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. వీరంతా అయిజలోని గద్వాల రోడ్డు మార్గంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో మకాం వేశారు.