చిన్నోనిపల్లె రిజర్వాయర్ పనుల ప్రారంభం నేపథ్యంలో నిర్వాసిత రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో చాగదోన, చిన్నోనిపల్లె, ఇందువాసి గ్రామాలకు చెందిన సుమారు 19 మంది రైతులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పోలీసులకు చిక్కకుండా తప్పించుకుపోయారు. పోలీసుల అదుపులో ఉన్న మూడు గ్రామాల రైతులను రాత్రి గట్టు తహసీల్దార్ జుబేర్ అహ్మద్ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. అయితే తహసీల్దార్ ఎదుట సంతకాలు చేసేందుకు చిన్నోనిపల్లె, ఇందువాసి గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు నిరాకరించడంతో వారిని మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.