
భూములను నమ్ముకుని బతుకుతున్నాం. ఇవి తప్పా.. మాకు వేరే జీవనాధారం లేదు. 17 ఏళ్లుగా నిర్వాసితుల గోడును పట్టించుకోలేదు. రిజర్వాయర్‌ను రద్దు చేసి, మా భూములను మాకు ఇవ్వాలి. బలవంతంగా గ్రామాన్ని ఖాళీ చేయించడం అన్యాయం. ఏడాదికాలంగా నిర్వాసిత రైతులు నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వం నిర్వాసిత రైతులపై దయచూపాలి.
– ఈరన్న, చిన్నోనిపల్లె
పంటలు పండిస్తున్నాం..
చిన్నోనిపల్లె రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల్లో ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఆయకట్టు లేకుండానే రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం మమ్ముల్ని బలి చేస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉండదు. మేం సాగుచేస్తున్న భూములను వదులుకోలేం. – మల్దకల్, చిన్నోనిపల్లె
