గద్వాల క్రైం: బ్యాంక్ లోక్‌అదాలత్ ద్వారా 33 కేసులు పరిష్కారం అయినట్లు గద్వాల సీనియర్ సివిల్ జడ్జి కవిత అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బ్యాంక్ లోక్‌అదాలత్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల రుణాల చెల్లింపుల్లో జ్యాపం కనబరిచి నోటీసులు తీసుకున్న 33 మంది రుణదాతలు తమ చెల్లింపులను బ్యాంక్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారన్నారు.
జమ్మిచేడ్‌లో వినియోగదారుల దినోత్సవం..
జమ్మిచేడ్‌లో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి కవిత హాజరై మాట్లాడారు. వినియోగదారులు ఏవైన వస్తువులు కొనుగోలు చేసిన క్రమంలో వాటి నాణ్యత పరిశీలించి, సబంధిత రశీదులు తీసుకోవాలన్నారు. వస్తువుల నాణ్యత లోపాల విషయంలో వ్యాపారీతో మరో వస్తువు తీసుకునేందుకు దోహద పడుతుందన్నారు. వ్యాపారీ నిరాకరించిన క్రమంలో రశీదు ఆధారంగా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. రూరల్ ఎస్‌ఐ ఆనంద్ పాల్గొన్నారు.