స్థానిక ఉపాధ్యాయులనే నియమించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఉపాధ్యాయులనే నియమించాలి

May 19 2026 2:10 AM | Updated on May 19 2026 2:10 AM

స్థానిక ఉపాధ్యాయులనే నియమించాలి

మహాముత్తారం: ఇన్‌చార్జ్‌ ఎంఈఓగా మండలంలో స్థానికంగా పనిచేస్తున్న సీనియర్‌ ఉపాధ్యాయులకే కేటాయించాలని మండల ఏఐఏవైఎస్‌ మండలాధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో విలేకర్ల సమావేవంలో ఆయన మాట్లాడుతూ మండలంలో సీనియర్‌ ఉపాధ్యాయులు ఉన్నప్పటికి వారిని నియమించకుండా విద్యాశాఖ అధికారులు స్థానికేతరులను నియమించారని ఆరోపించారు. ఇప్పటికై నా మండలంలో పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టిని పరిగణంలోకి తీసుకొని స్థానికులకు కేటాయించాలని అధికారులను కోరారు. ఏఐఏవైఎస్‌ మండల అధ్యక్షుడు రామగిరి రాజు, ప్రజాసంఘాల నాయకులు పీక కిరణ్‌, పుల్యాల సురేశ్‌, చిర్ర మల్లేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement