ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కృషి

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కృషి

లోక్‌ అదాలత్‌లో 353 కేసుల పరిష్కారం

భూపాలపల్లి: ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు అందించిన వివరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన 353 కేసులు పరిష్కారం అయినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ వెల్లడించారు. లోక్‌ అదాలత్‌ విజయవంతానికి కృషి చేసిన జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement