భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు రామగిరి అరవింద్‌సాయి ప్రతిష్టాత్మకమైన అండర్ 25 జాతీయ అవార్డును అందుకొని జిల్లా ప్రతిష్టను పెంచాడు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ‘యువ భారత్ రన్’ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్ ట్రైబ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా సమాజానికి చేసిన విశేష సేవలు, యువతకు ప్రేరణగా నిలిచే కార్యక్రమాలను గుర్తిస్తూ అవార్డును అందించారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సినీ నటుడు శర్వానంద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఘనత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, స్వర్ణకార సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


