మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కార్యనిర్వహణ ఇన్‌చార్జ్ అధికారి(ఈఓ)గా వీరస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్యనిర్వహణ ఇన్‌చార్జ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రేవెల్లి మహేశ్ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థానం ఇన్‌చార్జ్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న వీరస్వామిని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓగా నియమిస్తూ దేవాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు వీరస్వామి సోమవారం హేమాచలుడిని దర్శించుకుని ఆయన బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు.


