మక్కల కొనుగోళ్లలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లలో జాప్యం

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మక్కలను మార్కెట్‌ యార్డులో విక్రయానికి తీసుకువస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్క్‌ఫెడ్‌ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో మక్కలకు మద్దతు ధర రూ.2,400 అందడంలేదని, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి క్వింటాకు ధర రూ.1,800 చెల్లిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. కాగా, ఆందోళనతో మార్కెట్‌లో క్రయవిక్రయాలు నిలిచిపోగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఎంసీ గదిలో పీఏసీఎస్‌ సెక్రటరీ ప్రమోద్‌కుమారును నిర్బంధించారు.

ఆగ్రహించిన అన్నదాతలు

ఏఎంసీ గదిలో పీఏసీఎస్‌ సెక్రటరీ నిర్బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement