రూ. 396.69 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ. 396.69 కోట్లు

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

అభివృద్ధి పథంలో కేయూ

రూ. 27.13 కోట్ల లోటు బడ్జెట్‌

కేయూ

అంచనా బడ్జెట్‌

కేయూ క్యాంపస్‌ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్‌ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13 కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్‌హాల్‌లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్‌ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్‌లాల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్‌, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌గా రూ. 205.47 కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్‌ను ప్లానింగ్‌, నాన్‌ప్లానింగ్‌ రూపంలో రాబడులు, ఖర్చులు మొ త్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10 లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకడమిక్‌, ట్యూషన్‌ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్‌ సెనెట్‌.. బడ్జెట్‌ ఆమోదంతోపాటు స్టాండింగ్‌ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్‌ రాంనాథ్‌కిషన్‌, అకడమిక్‌ ఆడిట్‌ విభాగం రిజిస్ట్రార్‌ కోల శంకర్‌, కేయూ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ హబీబుద్దీన్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ వల్లాల పృథ్వీరాజ్‌, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్‌, అకౌంట్స్‌ విభా గాల ఉద్యోగులు, సెనెట్‌ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.

దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్‌, పరిశోధనల పరంగా అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్‌ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్‌, జాబ్‌ ఒరియెంటేడ్‌ కోర్సులు లక్ష్యంగా సిలబస్‌ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ‘ఐ’ రీసెర్చ్‌సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్‌ ఫె ల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్‌లోనే త్వరలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా ఏర్పా టు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్‌లైన్‌లో డిజిటలీకరణ, క్యాంపస్‌లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్‌ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

–కె. ప్రతాప్‌రెడ్డి, వీసీ

అకడమిక్‌ సెనెట్‌లో ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement