ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ రాహుల్‌శర్మ
గణపురం: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. శనివారం గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులు, స్టేజ్ 2 అధికారులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో సందేహాలుంటే సిబ్బంది శిక్షణ తరగతుల్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పొరపాటుకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కుమారస్వామి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీడీఓ భాస్కర్, మాస్టర్ ట్రైనర్లు ఎస్.శ్రీధర్, రఘునాధరెడ్డి పాల్గొన్నారు.
రెండో విడత ఎన్నికల ర్యాండమైజేషన్ పూర్తి
భూపాలపల్లి అర్బన్: రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ రెండో దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. విధులు కేటాయించిన పోలింగ్ సిబ్బందికి సకాలంలో నియామక ఉత్తర్వులు అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అంతరాయాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో శిక్షణ ఎంతో కీలకమైందని, శిక్షణా తరగతులకు హాజరు కావడం తప్పనిసరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీపీఓ శ్రీలత, ఈడీఎం శ్రీకాంత్ పాల్గొన్నారు.


