సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి
మొగుళ్లపల్లి: నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులు, స్టేజ్ 2 అధికారులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఏమైనా సందేహాలుంటే సిబ్బంది శిక్షణా తరగతుల్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ
మొగుళ్లపల్లి, ఇస్సిపేట, రంగాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుతున్న సౌకర్యాలు, తూకపు యంత్రాల పనితీరు, తేమ శాతం కొలిచే పరికరాల పనితీరు, ధాన్యం రవాణా ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్ పాల్గొన్నారు.


