రెండో విడతలో 10 పంచాయతీలు ఏకగ్రీవం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవయ్యాయి. రెండో విడతలో నాలుగు మండలాల్లో 85 గ్రామ పంచాయతీలు, 694 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చిట్యాల, భూపాలపల్లి, టేకుమట్ల, పలిమెల మండలాల్లో శనివారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరిరోజు కావడంతో నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. సింగిల్ నామినేషన్ ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. వివిధ మండలాల్లో పలు వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.
ఏకగ్రీవ పంచాయతీలివే..
పలిమెల జవ్వాజి పుష్పలత, భూపాలపల్లి మండలంలో బావుసింగ్‌పల్లి పోనగంటి ముత్తమ్మ, శ్యాంనగర్ ఓరుగంటి రజిత, టేకుమట్ల మండలంలో వెలిశాల బొడ్డు తిరుపతి, పెద్దంపల్లి వ్యాసనవేణి శ్రీలేఖ, చిట్యాల మండలంలో ముచినిపర్తి ఇంగిలి రాజేందర్, పాశిగడ్డతండా లావుడ్య రవీందర్, బావుసింగ్‌పల్లి ఎర్రబెల్లి రాజేశ్వర్‌రెడ్డి, చైన్‌పాక మాంత మనోహర్, ఏలేట్టరామయ్యపల్లి కొడారి అశోక్ ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
వార్డులు కూడా..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం శ్యాంనగర్ గ్రామపంచాయతీలో ఎనిమిది వార్డులు ఏక్రగీవమయ్యాయి. ఆరు కాంగ్రెస్ మద్దతుదారులు, రెండు బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఎన్నికయ్యారు. బావుసింగ్‌పల్లి పంచాయతీలోనూ 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.


