పోస్టల్ బ్యాలెట్లపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి అర్బన్: పోస్టల్ బ్యాలెట్ల జారీపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో గురువారం అన్ని విభాగాల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశకు ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు జారీ, పంపిణీ ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ 38, మైక్రో అబ్జర్వర్లు 36మంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి ఇందిర పాల్గొన్నారు.
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఫణీంద్రరెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ కలెక్టరేట్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ శ్రీలత పాల్గొన్నారు.
ఈసీ వీడియోకాన్ఫరెన్స్
అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ
పోస్టల్ బ్యాలెట్లపై అవగాహన ఉండాలి


