మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ సీఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎం ప్రవళిక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల ఉపాధ్యాయులు, నాయకులు ఆమెను అభినందించారు.
మట్టి పరీక్షలను
అడ్డుకున్న రైతులు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని వీఐపీ ఘాటు నుంచి మెయిన్ ఘాటు వరకు నిర్మిస్తున్న పుష్కరఘాటు పనుల్లో భాగంగా మట్టి పరీక్షలను భూనిర్వాసిత రైతులు మంగళవారం అడ్డుకున్నారు. మట్టి పరీక్షలకు జేసీబీతో మట్టి తోడుతుండగా భూనిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా తమ చేనుల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పనులు నిలిపివేశారు. పరిహారం చెల్లించకుండా పనులు చేస్తుండడంతో రైతులు ఆగ్రహించారు. రెవెన్యూ అధికారులు తమతో సంప్రదింపులు చేసిన తరువాతనే పనులు ప్రారంభించాలని తెలిపారు.
ఏఆర్ సీఐని కలిసిన నాయకులు
భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న కాశీరాంనాయక్‌ను ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. లంబాడీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ రాకేష్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అజ్మీర సమ్మయ్య, మాజీ జెడ్పీటీసీ జోగుల సమ్మయ్య, హరినాథ్, సురేష్, హరీశ్ కలిసి శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు.
ఎమ్మెల్యే స్వగ్రామంలో
సర్పంచ్ ఏకగ్రీవం
గణపురం: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామం గణపురం మండలం బుద్ధారం సర్పంచ్ ఏకగ్రీవమైంది. విడిదినేని శ్రీలత కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ వేయగా.. కొంరాజు అమృత బీఆర్‌ఎస్ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. అమృత మంగళవారం నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో శ్రీలత ఏకగ్రీవం లాంఛనమైంది. అమృత విత్‌డ్రా చేసుకున్నట్లు అధికారులు నామినేషన్ కేంద్రం ఎదుట పత్రం అంటించారు. శ్రీలత ఏకగ్రీవ అయినట్లు అధికారికంగా బుధవారం అధికారులు ప్రకటించనున్నారు. బుద్ధారం గ్రామంలో 12 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగీవ్రమయ్యాయి. మిగతా 3 వార్డులు కూడా ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే ఓసీ–2 ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలకు నష్టపరిహారం చెల్లించాలని ఫక్కీర్‌గడ్డ గ్రామ బాధితులు, పలువురు భూనిర్వాసితులు మంగళవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేవారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామాలైన ఆకుదారువాడ, ఫక్కీర్‌గడ్డ, హనుమాన్‌నగర్, మదీనాకాలనీ, శాంతినగర్ కాలనీలకు చెందిన నివాసగృహాలు, వ్యవసాయ భూములు డేంజర్ జోన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ నాయకులు బుర్ర రమేష్, బుర్ర అనిల్, మనోజ్ గౌడ్, సెగ్గం శంకర్, బుర్ర రాజయ్య, ఆముదాల రమేష్, బాబు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక


