ఓటర్లు ఆలోచించండి!
ఎన్నికలపై విద్యార్థుల అవగాహన
కాళేశ్వరం: ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో అమూల్యమైన ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. గ్రామానికి అందుబాటులో ఉండే నాయకుడే మీకు మంచి చేస్తాడు. ఎన్నికల సమయంలో డబ్బులు, చీరలు, మద్యం ఇతర తైలాలు ఇచ్చే వారిని నమ్మొద్దని మహదేవపూర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మడక మధు ఆధ్వర్యంలో ఓటర్లకు మంగళవారం అవగాహన కల్పించారు.
ఒక పూట వండుకు తినే నాటు కోడి రూ.వెయ్యికి తక్కువ కాదు. మన భావితరాల భవిష్యత్‌ను రూ.500కి, రూ.వెయ్యికి, రాత్రి తాగి పొద్దున్నే జీర్ణమైపోయే మద్యం చుక్కకో, ఓ చీరకో అమ్మేసుకుంటే అది మనం చచ్చిన కోడికన్నా, గాడిద కన్నా దిగజారడమే. అందుకే నిజాయిగల మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.
– సాత్విక, విద్యార్థి, మహదేవపూర్
ఓటు మన భవిష్యత్‌కు బంగారు తాళం చెవి. ఆ తాళం చెవిని నోటుకు అమ్మేయొద్దు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయగలిగే సమర్థుడైన నాయకుడికే ఓటు వేయండి. ప్రచార సమయంలో రోజుకు నాలుగైదు సార్లు వచ్చి వంగివంగి దండాలు పెట్టే వారికి మీ ఓటు వద్దు. మీ ఊరు అభివృద్ధికి అహర్నిషలు కృషి చేసే వారికి ఓటేయండి. పదవి ఉన్నా, లేకున్నా ఎల్లప్పు డూ మీ పక్కనే ఉండి మీ ఆపదలో మీ సంతోషంలో తోడుగా నిలిచే నాయకుడిని ఎన్నుకోండి.
– దినేష్, విద్యార్థి, మహదేవపూర్
ప్రతీ ఓటరు మద్యం, చీరలు, డబ్బు వంటి ప్రలోబాలకు లొంగకుండా తన ఓటు హక్కును బాధ్యతతో వినియోగించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులతో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాం.
– మడక మధు, ఫిజికల్ సైన్స్ టీచర్, మహదేవపూర్
ఓటర్లు ఆలోచించండి!
ఓటర్లు ఆలోచించండి!
ఓటర్లు ఆలోచించండి!


