ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
కాటారం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. కాటారం మండలం కొత్తపల్లి, చింతకాని, రేగులగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వ, కొనుగోలు ప్రక్రియ, రవాణా తదితర అంశాలపై ఆరా తీశారు. తూకం విధానం, తేమ కొలిచే పరికరాల పనితీరు, సౌకర్యాలు, గన్నీసంచుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా కొనుగోళ్లు సాగించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్, తహసీల్దార్ నాగరాజు, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు.


